
అప్పుడు ఇప్పుడు తల్లి సురేఖతో చరణ్
ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి లేటెస్ట్‌గా రామ్‌చరణ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి పోస్ట్‌ను తన తల్లి సురేఖకు అంకితం చేశారు చరణ్. సోమవారం ఇన్‌స్టా ఎంట్రీ ఇచ్చిన చరణ్ శుక్రవారం నా మొదటి పోస్ట్‌ను షేర్ చేస్తాను అని ప్రకటించారు. మొదటి పోస్ట్ దేనికి సంబంధించి ఉంటుందా? అని ఫ్యాన్స్ అందరూ ఊహాగానాలు మొదలెట్టేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అప్‌డేట్ అని కొందరు, ‘సైరా’ అప్‌డేట్ అని మరికొందరు ఊహించారు. కానీ తన తల్లితో దిగిన రెండు ఫొటోలను అప్‌లోడ్ చేశారు. ‘‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మా.. లవ్ యు’’ అని క్యాప్షన్ చేశారు చరణ్. ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో అనే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment