ఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌ | Ram Charan and Alia Bhatt to shake a leg for a romantic song in RRR | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ రొమాంటిక్‌ టైమ్‌

Published Mon, Nov 25 2019 5:49 AM | Last Updated on Mon, Nov 25 2019 5:49 AM

Ram Charan and Alia Bhatt to shake a leg for a romantic song in RRR - Sakshi

రామ్‌చరణ్‌,ఆలియా భట్‌

ఎన్టీఆర్‌ని కొమరమ్‌ భీమ్‌గా, రామ్‌చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లోకి మార్చేశారు దర్శకుడు రాజమౌళి. ఇదంతా ఆయన చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసమే అని తెలిసిందే. ప్రస్తుతం ఓ సాంగ్‌ షూటింగ్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ బిజీగా ఉన్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్‌ సరసన ఓలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఆలియా భట్‌లపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారట. దీనికోసం ఓ భారీ సెట్‌ని కూడా వేశారని తెలిసింది. ఈ సినిమాలో ఆలియా భట్‌ పాత్ర ఎక్కువ సేపు ఉండకపోవచ్చని సమాచారం. సుమారు 70 శాతం షూటింగ్‌ ఆల్రెడీ పూర్తయిందని చిత్రబృందం ఇటీవల పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో పది భాషల్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement