
బీభత్సమైన పోరాట సన్నివేశాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు కఠినమైన కసరత్తులు చేయాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదే చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం... రణం... రుధిరం). ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. పోరాట సన్నివేశాలు తీస్తున్నారు. దాంతో హీరోలిద్దరూ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. మధ్య మధ్యలో కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అలా రిలాక్స్ అవుతున్న ఫొటోలను షేర్ చేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment