కల్పనా? నిజమా? | NTR to use heavy prosthetic makeup for old man look | Sakshi
Sakshi News home page

కల్పనా? నిజమా?

Published Tue, Dec 15 2020 5:45 AM | Last Updated on Tue, Dec 15 2020 5:45 AM

NTR to use heavy prosthetic makeup for old man look - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫిక్షన్‌ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్‌ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్‌ చిన్న వయసులోనే మరణించారు. అయితే ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్‌కి ఓల్డ్‌ గెటప్‌ పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ‘ప్రోస్థటిక్‌’ మేకప్‌ వాడాలనుకుంటున్నారట. మరి.. ఈ పాత్ర ఉందన్నది ఫిల్మ్‌ నగర్‌ కల్పనా? నిజమా? ట్రిపుల్‌ ఆర్‌లో ఎన్టీఆర్‌ రెండు గెటప్పుల్లో కనబడతారా? వెయిట్‌ అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement