ఆచార్యలో... కియారా అద్వానీ | Kiara Advani to romance Ram Charan in Acharya | Sakshi
Sakshi News home page

ఆచార్యలో...

Published Tue, Dec 8 2020 6:05 AM | Last Updated on Tue, Dec 8 2020 6:48 AM

Kiara Advani to romance Ram Charan in Acharya - Sakshi

‘వినయ విధేయ రామ’ చిత్రంలో జంటగా నటించారు రామ్‌చరణ్, కియారా అద్వానీ. ఇప్పుడు రెండోసారి జోడీగా నటించనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌  నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు చరణ్‌. విద్యార్థి నాయకుడిగా ఆయన పాత్ర ఉంటుంది. చరణ్‌కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. వచ్చే నెలలో ఈ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటారట. ప్రస్తుతం పలు బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు కియారా. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఇందూకీ జవానీ’ ఈ నెల 11న థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement