
ఎన్టీఆర్, రామ్‌చరణ్
గాయాలతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. మళ్లీ పదిరోజుల తర్వాత పరుగు మొదలు కానుందని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపిస్తారు.
ఆ మధ్య జిమ్‌లో రామ్‌చరణ్ గాయపడ్డారు. ఇటీవల షూటింగ్ చేస్తూ ఎన్టీఆర్ చిన్నగా గాయపడ్డారు. దీంతో ఈ చిత్రం షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. వచ్చే పదిరోజుల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటారని సమాచారం. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.
Comments
Please login to add a commentAdd a comment