![Music Director SS Taman Exclusive Interview - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/10/S-Thaman-Interview-Photos--.jpg.webp?itok=5C-z0jNk)
‘సామజ వరగమన...’ అన్నారు తమన్.. అన్ని వర్గాల పాటల ప్రేమికులు... ‘ఏం ట్యూన్ అన్నా’ అన్నారు. ఇదొక్కటేనా? అంతకుముందు ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు. అయితే ‘సామజ..’ వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. శంకర్ ‘బాయ్స్’లో నటించిన తమన్ ఇప్పుడు రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంగీతదర్శకుడు. ‘సాక్షి’కి తమన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.
► శంకర్ డైరెక్షన్‌లో నటించిన ‘బాయ్స్’ తర్వాత ఇన్నేళ్లకు ఆయన సినిమాకి సంగీతం అందిస్తున్నారు...
ఈ స్థాయికి రావడానికి ఇరవయ్యేళ్లు పట్టింది. నిజానికి సంగీతం అంటేనే నాకు ఆసక్తి. ‘బాయ్స్’ అçప్పుడే శంకర్ సార్‌తో మ్యూజిక్ గురించి మాట్లాడేవాణ్ణి. నా ట్యూన్స్‌ని ఫస్ట్ విన్నది ఆయనే. నిజానికి ‘బాయ్స్’ సినిమాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌ను నేనే. అయినప్పటికీ మ్యూజికల్‌గానే నా లైఫ్‌ను మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ముందు గా నేను సినిమాల నుంచి నేర్చుకోవాలనుకున్నాను. శంకర్‌గారు పాటలు ఎలా తీయిస్తున్నారు? కెమెరామేన్ రవిచంద్రన్‌గారు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నా. అలా నా కెరీర్‌లో ఓ ఏడాది శంకర్ సార్‌కు కేటాయించాను. ‘బాయ్స్’లో మాత్రమే యాక్ట్ చేశాను. యాక్టింగ్ నా స్పేస్ కాదనిపించింది.
► శంకర్‌ని తరచూ కలుస్తుంటారా? నటుడిగా ఎందుకు కొనసాగలేదు? చాన్స్ రాలేదా?
‘బాయ్స్’ చిత్రయూనిట్‌లోని యాక్టర్స్‌లో ఇప్పటికీ ఆయన్ను తరచూ కలుస్తుండేది నేనే. ఆ సినిమా విడుదలైన ఓ రెండు, మూడేళ్ల తర్వాత .. ‘నువ్వు యాక్ట్ చేయనన్నావని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. అజిత్, విజయ్ సినిమాల్లో యాక్ట్ చేయనన్నావట? ఏడాది పాటు కష్టపడ్డావు? నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు?’ అని శంకర్‌గారు అడిగారు. ‘‘వారికి ఏదో ఒక రోజు మ్యూజిక్ చేస్తాను కానీ వారి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకోవడంలేదు’’ అని ఆయనకు చెప్పాను. ‘సరే.. మ్యూజిక్కే చేస్తావా?’ అన్నారు. అవునన్నాను. ‘నా ప్రొడక్షన్‌లో రూపొందుతున్న ‘ఈరమ్’ (2009) (తెలుగులో ‘వైశాలి’) సినిమాకు సంగీతం ఇస్తావా?’ అని అడిగారు.. చేశాను. ఆ తర్వాత ‘మాస్కోవిన్ కావేరి’ సినిమాకు సంగీతం అందించే చాన్స్ వచ్చింది. ఎస్ పిక్చర్స్ (ఈరమ్), ఆస్కార్ ఫిలింస్ (మాస్కోవిన్ కావేరి) చెన్నైలో అప్పటికే పెద్ద బ్యానర్స్. నేను మ్యూజిక్ అందించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే.. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా నా ఫస్ట్ ఫిల్మ్ శంకర్‌గారిదే.
► ఇప్పుడు హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లోని సినిమాకు చాన్స్ ఎలా వచ్చింది?
శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మాణంలో సినిమా ఓకే అయ్యిందని తెలియగానే ... ‘దిల్’ రాజుగారితో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఏఆర్ రెహమాన్‌గారు తొలిసారి మ్యూజిక్ చేయనున్నారు.. అదీ శంకర్‌సార్ దర్శకత్వంలో.. కంగ్రాట్స్ సార్’ అన్నాను. కానీ ఆయనేమో ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నాకు శంకర్ వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. నిన్నే కావాలంటున్నారు, మార్చి 1న ఆయన్ను వెళ్లి కలువు’ అన్నారు. షాకయ్యాను.
► మరి.. ఏఆర్ రెహమాన్ మీ సినిమాకు సంగీతం చేయడం లేదా అని శంకర్‌ను అడిగారా?
అడగలేదు. ఆయనకు ఫోన్ చేస్తే, ‘15 రోజుల్లో ఓ సాంగ్ చేయాలి.. నువ్వు ఎప్పుడొస్తావ్?’ అని అడిగారు. ‘ఒక వారం టైమ్ ఇవ్వండి.. వస్తాను’ అన్నాను. ఇప్పటివరకు మూడు పాటలు పూర్తి చేశాను. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయి.
► ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులతో వర్క్ చేసిన శంకర్ టేస్ట్‌కు తగ్గట్లు మ్యూజిక్ అందించగలనా అనే ఆందోళన లేదా?
భయం ఉంటే మనం ముందుకు వెళ్లలేం. చాలెంజింగ్‌గా తీసుకున్నాను. దర్శకులు శంకర్, త్రివిక్రమ్ ఒకేలా ఆలోచిస్తారని నా అభిప్రాయం. ఇద్దరూ పదేళ్లు ముందుగా ఆలోచిస్తారు. వారిద్దరినీ పట్టుకోవాలి. దాని కోసం కొంచెం ఎక్కువగా పరిగెడతాను అంతే.
► త్రివిక్రమ్‌తో ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల మీ పని ఈజీ అయ్యిందనుకోవచ్చా?
త్రివిక్రమ్ నాకో ప్రొఫెసర్‌లాంటి వారు. ఆయన దర్శకత్వంలో ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశాక మ్యూజిక్ పట్ల నా దృష్టి కోణం మారింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ త్రివిక్రమ్‌గారి వల్లే వచ్చిందను కుంటున్నాను. ‘అల.. వైకుంఠపురములో..’ సక్సెస్ వల్లే శంకర్‌గారితో సినిమా చేసే చాన్స్ వచ్చిందని నమ్ముతున్నాను.
► నా హార్ట్‌కు, బ్రెయిన్‌కు మధ్య త్రివిక్రమ్ ఓ కొత్త నర్వ్ వేశారని అన్నారు ఓ సందర్భంలో.. వివరిస్తారా?
అది నిజమే. కొంతమందిని కలిసినప్పుడు మనం మారిపోతుంటాం... కనీసం ఒక శాతం అయినా. అది పెళ్లైన తర్వాత భార్య వల్ల కావొచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక బాస్ వల్ల కావొచ్చు.. మనం మారవచ్చు. త్రివిక్రమ్‌గారి వల్ల నేను మారిపోయాను. సినిమాకు ఉన్న వేరే కోణాలు ఏంటో ఆయన చెప్పారు. ఇదివరకు నేను సినిమా ముందు ఉండేవాణ్ణి. ఆయనతో వర్క్ చేసిన తర్వాత సినిమా వెనక్కి వెళ్లాను. ఇప్పుడు స్క్రీన్ వెనకాల నుంచి వర్క్ చేస్తున్నాను.
► త్రివిక్రమ్ ఒక నర్వ్ వేశారు. మరి.. శంకర్?
ఆ నరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాను.
► మీ అమ్మగారితో పాడించాలని ఎప్పుడూ అనుకోలేదా?
నాన్న చనిపోయాక 27 ఏళ్లుగా అమ్మ బాధ్యత అంతా నాదే. పాడతానని అమ్మ అడుగుతుంటారు. అయితే ఫ్యామిలీ చేత ఎక్కువ పాడిస్తున్నానంటారేమో అని ఆగాను. నా భార్య శ్రీవర్ధిని ‘కిక్’ , ‘ఆంజనేయులు’ వంటి సినిమాల్లో పాడారు. అలాగే విశాల్ సినిమాకీ పాడుతున్నారు.
► మ్యూజిక్ పరంగా చెన్నైతో పోలిస్తే హైదరాబాద్..?
హైదరాబాద్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది. మ్యూజిక్‌కి పెద్ద బేస్ ఇది. చెన్నై ముంబై నుంచి కూడా తరచుగా రాకపోకలు సాగించే మ్యుజిషియన్స్ ఉన్నారు. లోకల్‌గా ఎక్కువ సింగర్స్ ఉన్నారు. కీరవాణి, మణిశర్మ, కోటి వంటివారు చాలా ట్రైన్ చేసేశారు. అలాగే ఇక్కడ బ్యాండ్ కల్చర్ బాగా ఉండడం వల్ల చాలామంది ఇతర వాద్య కళాకారులు కూడా బాగా వచ్చేశారు.
► రీ– రికార్డింగ్ అంటే ఒకప్పుడు చెన్నై కేరాఫ్?
అవును.. అయితే ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి.
► క్రికెట్ బాగా ఆడతారు కదా?
అవును శని, ఆదివారాల్లో పూర్తిగా క్రికెట్ ఆడుతూ ఉంటా. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులో మరొకరో ఉండరు. అక్కడా సింగర్స్, ఇతర మ్యుజిషియన్స్ ఉంటారు. హైదరాబాద్, చెన్నైలలో 2 టీమ్స్ ఏర్పాటు చేశాం.
► డైరెక్టర్ శంకర్ ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం.. ఇప్పుడు శంకర్ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్... శంకర ప్రియతమన మ్యూజిక్ డైరెక్టర్... తమన్
ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
ఈరోజు ఉదయం 9:30 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గంటలకు ‘సాక్షి’ టీవీలో
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment