
ఎన్టీఆర్, రామ్‌చరణ్
బ్రిటీషర్స్‌పై యుద్ధం మొదలెట్టారు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు. ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్ భామ ఆలియా భట్ కథానాయిక. చరణ్ సరసన ఆలియా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎవరు కనిపిస్తారన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, జిమ్‌లో గాయపడిన కారణంగా చరణ్ కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఈ షూటింగ్‌లో గాయపడిన ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు హీరోలూ జోష్‌గా ఈ సెట్‌లోకి ఎంటరయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తాజా షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో ఆరంభం అయింది. నగర శివార్లలో వేసిన సెట్లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని తెలిసింది. దాదాపు నెలరోజులకు పైనే ఈ షెడ్యూల్ సాగనుందని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment