
ఆలియా భట్
అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ.. అంటూ తెలుగు పలుకులు పలుకుతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. కష్టమైనా ఇష్టంగా తెలుగు పాఠాలను ఐపాడ్ మీద దిద్దుతున్నారామె. ఈ తెలుగు పాఠాలన్నీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇందులో రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా ఆలియా భట్ నటిస్తున్నారు. తన పాత్ర మీద బాధ్యతతో, తెలుగు డైలాగ్స్ పలకడం కోసం స్పెషల్ క్లాసులకు వెళ్తున్నారట ఆలియా .
ఈ విషయం గురించి ఆలియా చెబుతూ – ‘‘తెలుగు నేర్చుకోవడం ఓ చాలెంజ్. ఎందుకంటే తెలుగు కొంచెం కష్టమైన భాష. కానీ భావాలను వ్యక్తపరచడానికి వీలైనటువంటి భాష కూడా. భాషకు సంబంధించిన చిన్న చిన్న డీటైల్స్ కూడా తెలుసుకుంటున్నాను. పదాలు ఇలానే ఎందుకు పలకాలి? ప్రతీ పదానికి అర్థమేంటి? అనేది తెలుసుకుంటున్నాను. అప్పుడే నా పాత్ర, అది పలికే సంభాషణలను పూర్తిగా తెలుసుకోగలను. ఒక్క తెలుగు వాక్యం పూర్తిగా పలికినా ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment