పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా పరిచమవుతున్న చిత్రం "ఉప్పెన". ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రింగుటోన్లుగా మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాట యూట్యూబ్‌లో 143 మిలియన్ పైచిలుకు వ్యూస్ సంపాదించుకుంది. అలా ఈ చిత్రంలోని పాటలు వీక్షకులను కట్టిపడేయగా అందులో నటించిన కృతీశెట్టికి యువత దాసోహం అంటోంది. అమాయకత్వం కురిపించే కళ్లు, మాయ చేసే నవ్వుతో ఆమె యువతను బుట్టలో పడేసుకున్నారు. (‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ)
అయితే ఆమె కూడా ఒకరికి పడిపోయారట! మెగా హీరో రామ్‌చరణ్‌కు వీరాభిమాని అని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను ఇండస్ట్రీకి రాకముందే చెర్రీ నటించిన అన్ని సినిమాలను చూశానని తెలిపారు. కాగా ఆమె నటించిన ఉప్పెన చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మరోవైపు కృతీ నేచురల్ స్టార్ నాని 'శ్యామ సింగ రాయ్ 'చిత్రంలోనూ నటిస్తున్నారు. (స్విమ్ ఫొటో’.. క్షమించమని అడిగిన హీరో!)
Comments
Please login to add a commentAdd a comment