
ఎన్టీఆర్, రామ్‌చరణ్
‘మా సినిమా వర్కింగ్ టైటిల్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. దాని ఫుల్‌ఫామ్ మీరే (ప్రేక్షకులు) సూచించండి, నచ్చింది తీసుకుంటాం’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌కి ఫుల్‌ఫామ్ ఫిక్స్ చేశారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. మిగతా భాషల్లో ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ టైటిల్‌ను ఉపయోగించాలనుకుంటున్నారట. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment