రామ్‌చరణ్‌- శంకర్ కాంబినేషన్.. క్రేజీ అప్‌డేట్..! | Ram charan Latest Movie Shootings Starts Tomorrow At Rajamandry | Sakshi
Sakshi News home page

Ram Charan: రామ్‌ చరణ్ లేటెస్ట్ మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?

Published Sun, Oct 9 2022 7:02 PM | Last Updated on Sun, Oct 9 2022 7:03 PM

Ram charan Latest Movie Shootings Starts Tomorrow At Rajamandry - Sakshi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. రాజమండ్రిలో జరగనున్న షూటింగ్‌ కోసం రామ్‌చరణ్‌ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం రామ్‌చరణ్‌ 15వ సినిమాగా నిలవనుంది. ఆరు రోజుల పాటు రాజమండ్రిలో షూట్‌ జరగనున్నట్లు సమాచారం. 

ఈ సినిమాలో పాన్‌ ఇండియా స్థాయిలో భారీ  అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రామ్‌ చరణ్ డ్యూయల్ రోల్ అయితే తాను చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ కనిపంచనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా చరణ్‌ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement