
లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ఈ ఖాళీ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటోంది ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ ఇళ్లలోని మినీ హోమ్ థియేటర్స్‌ను డబ్బింగ్ స్టూడియోలుగా మార్చుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారని లేటెస్ట్ టాక్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారట రాజమౌళి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment