చిరు సందర్శన | Chiranjeevi and Ram Charan visits Koratala Siva office | Sakshi
Sakshi News home page

చిరు సందర్శన

Published Sat, Oct 19 2019 12:13 AM | Last Updated on Sat, Oct 19 2019 2:37 AM

Chiranjeevi and Ram Charan visits Koratala Siva office - Sakshi

కొరటాల శివ, రామ్‌చరణ్‌

చిరంజీవి 152వ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివ ఆఫీస్‌ను సరదాగా సందర్శించారు రామ్‌చరణ్‌. ఆ సందర్భంలో  కొరటాలతో దిగిన ఈ ఫొటోను రామ్‌చరణ్‌ షేర్‌ చేసి, ‘‘శివగారి ఆఫీస్‌లో ఎనర్జీ చాలా నచ్చింది. నాన్న 152వ సినిమా తెరకెక్కించబోతున్నందుకు ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇక ఇక్కడి ఫొటో చూస్తే చరణ్‌ అయ్యప్ప దీక్షలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఏడాదీ చరణ్‌ అయ్యప్ప మాల  వేసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement