ఎన్టీఆర్, రామ్‌చరణ్
రాజమౌళి ఆలోచనలు గ్రాండ్‌గా ఉంటాయి. ఆ ఆలోచనల్ని స్క్రీన్ మీద చూపించడానికి అదే రేంజ్‌లో ఖర్చు చేస్తుంటారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం సుమారు 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తారు. రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీన్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్‌లో సుమారు 1000 మందికిపైనే జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్నారు. వీళ్లందర్నీ ఎన్టీఆర్ ఎదుర్కొంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో చరణ్ కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరణ నుసుమారు నెలరోజుల పాటు ప్లాన్ చేసిందట చిత్రబృందం. ఈ ఎపిసోడ్ ఖర్చు 40 కోట్లు అని తెలిసింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయం ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment