
ఎన్టీఆర్
యాక్షన్ సన్నివేశాలు లైవ్లీగా రావడానికి సెట్‌లో ఎన్టీఆర్ ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిస్కీ ఫైట్స్‌ని డూప్ లేకుండా చేయడానికే ఆసక్తి చూపుతారు. ఈ ప్రయత్నాన్ని రిపీట్ చేసే ప్రాసెస్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్‌లో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు.
1921 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్‌పై కొన్ని యాక్షన్ సీన్‌లు ప్లాన్ చేశారు టీమ్. ఈ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎన్టీఆర్ చేయి బెణికింది. దీంతో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లొచ్చారని తెలిసింది. ఇది చిన్న గాయమేనని తెలిసింది. చేయి బెణకడం వల్ల జస్ట్ మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని, మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment