స్కూల్‌లో రామ్‌చరణ్
చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అందరికీ స్పెషలే. అక్కడికి ఎప్పుడు వెళ్లినా మళ్లీ ఆ స్కూల్ స్టూడెంట్ అయిపోవడం కామన్. ఇప్పుడు అలానే బ్యాక్ టు స్కూల్ వెళ్లిపోయారు రామ్‌చరణ్. తను చదువుకున్న లారెన్స్ స్కూల్‌ను ఇటీవల సందర్శించారు. ఆ స్కూల్‌తో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ ఫోటోలను చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ‘‘జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. స్కూల్ క్యాంటీన్, హాస్టల్, క్లాస్ గ్రూప్ ఫోటో ఇవన్నీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు చటుక్కున గుర్తొసాయి.
స్కూల్‌ని మిస్ అయిన ఫీలింగ్ కలిగిస్తాయి. చరణ్‌కి కూడా తన స్కూల్ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. తనలోని చిన్నపిల్లోడిని మళ్లీ బయటకు తీసుకొచ్చాయి’’ అన్నారు ఉపాసన. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కోసం వర్కవుట్స్ చేస్తూ రామ్‌చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో షూటింగ్‌కి చిన్ని బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్‌లో సరదాగా స్కూల్‌ను సందర్శించారనుకోవచ్చు. కొన్ని రోజుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment