
రామ్‌చరణ్
మనసు చెబుతున్న మాట వినాలా? లేక మెదడు వినిపిస్తున్న ఆలోచనను ఫాలో కావాలా? అని రామ్‌చరణ్ కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు. మరి.. చరణ్‌ను ఇంతలా ఇరుకున పడేసిన ఆ సమస్య ఏమిటి? అంటే వర్కౌట్ అన్నమాట. కరోనా కారణంగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. ఈలోపు ఫిట్‌నెస్‌పై ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారు రామ్‌చరణ్.
తన వర్కౌట్ ఫొటోలను షేర్ చేసి, ‘‘మైండ్ వర్కౌట్ చేయమని చెబుతోంది. హృదయం ఇక చాలు ఊరుకోమంటోంది’’ అని క్యాప్షన్ ఇచ్చారు రామ్‌చరణ్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment