ఇంటర్వెల్‌తో ఎంట్రీ | Director Boyapati Srinu Birthday Celebrations On The Sets | Sakshi
Sakshi News home page

ఇంటర్వెల్‌తో ఎంట్రీ

Published Thu, Apr 26 2018 12:34 AM | Last Updated on Thu, Apr 26 2018 12:34 AM

Director Boyapati Srinu Birthday Celebrations On The Sets - Sakshi

చిత్రబృందం సమక్షంలో బోయపాటికి కేక్‌ తినిపిస్తున్న రామ్‌చరణ్‌

ఫుల్‌ మాస్‌ హీరోకు మాస్‌ డైరెక్టర్‌ తోడైతే ఇక పిక్చర్‌ ఊర మాసే. థియేటర్స్‌లో ఆడియన్స్‌ విజిల్సే. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో  న్యూ లుక్‌లో కనిపించడం కోసం రామ్‌చరణ్‌ ఆల్రెడీ హెవీ వర్కౌట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం నుంచి ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు హీరో రామ్‌చరణ్‌.

ప్రస్తుతం ఇంటర్వెల్‌కి ముందు వచ్చే లీడ్‌ సీన్‌ తీస్తున్నారని సమాచారం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అంటే కచ్చితంగా అదిరిపోయేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. రామ్‌చరణ్‌   ఇంటర్వెల్‌ సీన్స్‌తో ఈ సెట్స్‌లోకి ఎంటరయ్యారన్నమాట. కియారా అద్వానీ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఆ సంగతలా ఉంచితే..  ఈ షూటింగ్‌ లొకేషన్‌లో బుధవారం బోయపాటి బర్త్‌డే జరిగింది. చిత్రబృందం సమక్షంలో బోయపాటి కేక్‌ కట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement