
‘భరత్ అనే నేను’ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు తన ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్టర్‌ని పోస్ట్ చేశారు.
భారీగా ప్రజలు హాజరైన ఫొటోపై ‘‘శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అనే ప్రమాణ స్వీకార పాఠాన్ని పోస్టర్‌పై ఉంచారు. అయితే ఈ పోస్టర్‌లో భరత్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది, అదే తేదీన ముందుగానే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా బృందం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Superstar Mahesh Babu's #MB24, directed by Siva Koratala, will take the First Oath this Republic Day!#MB24FirstOathOn26Jan pic.twitter.com/qYgjTnRtXh
— DVV Entertainments (@DVVEnts) 15 January 2018
Comments
Please login to add a commentAdd a comment