దర్శకుడు బోయపాటి శీను సినిమా అంటేనే ఫుల్ మాస్. అభిమానులంతా కోరుకునే హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఊర మాస్ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. ‘తులసి’లో ‘నే చుకు చుకు బండిని రో...’, ‘సరైనోడు’లో ‘బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే..’ అందుకు ఉదాహరణలు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక.
ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట బోయపాటి. ఈ సాంగ్‌లో రామ్ చరణ్‌తో పాటు రకుల్ ప్రీత్‌సింగ్ ఊర మాస్ స్టెప్పులు వేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటివరకూ రకుల్ స్పెషల్ సాంగ్స్ చేయలేదు. ఒకవేళ ఈ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఫస్ట్ టైమ్ ఈ స్పెషల్ సాంగ్‌లో ఏ రేంజ్‌లో స్టెప్పులతో అదరగొడతారో చూడాలి మరి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో కార్తీతో ఓ సినిమా, హిందీలో అజయ్ దేవగన్‌తో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment