నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో యావత్ భారతదేశం గర్విస్తోంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. అయితే ఈ సినిమాకు కావాల్సినంత బడ్జెట్ సమకూర్చిన నిర్మాత దానయ్య మాత్రం ఏ వేడుకలోనూ పాల్గొనడం లేదు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చిత్రయూనిట్ అంతా అమెరికా చెక్కేసినా దానయ్య మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఏ అవార్డు ఫంక్షన్‌లోనూ ఆయన కనిపించలేదు. తాజాగా తన సినిమాకు ఆస్కార్ రావడంపై తొలిసారి స్పందించాడు.
'తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయం. 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామన్నాను. అప్పటినుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. మర్యాద రామన్న చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇంకా పెద్ద సినిమా చేయాలనుంటున్నానని చెప్పాను. తన రెండు ప్రాజెక్టులు అయిపోయాక చెప్తానన్నారు. సరే అన్నాను. అలా ఆర్‌ఆర్‌ఆర్ నా చేతికి వచ్చింది. ఇద్దరు స్టార్లతో ఇంత పెద్ద సినిమా తీస్తారని ఊహించలేదు. కానీ కరోనా వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అయింది. నాటు నాటు ఒక్క పాటనే 30 రోజులు రిహార్సల్ చేసి ఉక్రెయిన్‌లో 17 రోజులు షూట్ చేశాం. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చింది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. ఆయన కష్టానికి ప్రతిఫలమే ఈ పురస్కారం. ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వాళ్లు ఫంక్షన్‌లో బిజీగా ఉన్నట్లున్నారు. కాబట్టి మాట్లాడలేకపోయాను' అన్నాడు దానయ్య.
Comments
Please login to add a commentAdd a comment