
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు, యంగ్ హీరో కల్యాణ్ ఓ ఇంటివాడయ్యాడు. వేదమంత్రాల సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హీరోలు రామ్‌చరణ్, పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళితో పాటు పలువురు ఈ వివాహ వేడుకకకు విచ్చేసి సందడి చేశారు. దానయ్య వచ్చిన అతిథులను దగ్గరుండి రిసీవ్ చేసుకుని వారితో పెళ్లిమండపంలో ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కొత్త పెళ్లికొడుకు కల్యాణ్ విషయానికి వస్తే అతడు అధీరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌ల సమక్షంలో గతేడాది వేసవిలో ఈ సినిమా ప్రారంభమైంతది. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Happy Married Life @IamKalyanDasari 💐🎉#DVVDanayya#RamCharan #PrashanthNeel #SSRajamouli pic.twitter.com/MV3U1M9ar7
— Dheeraj Pai (@DheerajPai1) May 20, 2023
చదవండి: సీరియల్ నటీనటుల పెళ్లి.. ఆమెను ఎందుకు మోసం చేశావంటూ మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment