ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. దానయ్య కుమారుడు, యంగ్ హీరో కల్యాణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. సమత అనే అమ్మాయితో శనివారం (మే 20న) ఏడడుగులు వేయబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మాదాపూర్‌లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ శుభకార్యానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై వధూవరును ఆశీర్వదించనున్నారట.
ఇకపోతే కల్యాణ్ అధీరా అనే సూపర్ హీరో సినిమాతో త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతేడాది వేసవిలో డైరెక్టర్ రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌ల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది. జాంబి రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తనయుడి సినిమా బాధ్యతలను దానయ్య తండ్రిగా తన భుజానికెత్తుకున్నాడు.
ఇకపోతే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో దానయ్య పేరు మార్మోగిపోయింది. రాజమౌళితో సినిమా చేయడం కోసం ఆయనకు 2006లోనే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాడు దానయ్య. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాణ బాధ్యతలను దానయ్యకు అప్పగించాడు జక్కన్న. ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్ పెట్టిన దానయ్య ఆస్కార్ ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొనలేదు. అయితే తను నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు రావడంతో ఉప్పొంగిపోయాడు. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుజీత్ డైరెక్షన్ అందిస్తున్నాడు.
చదవండి: హీరోయిన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అమ్మాయిలు, ఎందుకిలా టార్చర్ చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment