
రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!
రాజకీయాలు తక్కువేంటి? అసలు, మహేశ్‌బాబు రియల్ లైఫ్ డిక్షనరీలో రాజకీయాలకు ఎప్పుడూ ప్లేస్ లేదు. ‘నన్ను రాజకీయాల్లోకి తీసుకెళితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మా అబ్బాయిని తీసుకెళ్లినంత పనవుతుంది. మా ఇద్దరికీ రాజకీయాల గురించి ఏం తెలీదు’ అని మహేశ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ, రీల్ లైఫ్ డిక్షనరీలో మాత్రం అప్పుడప్పుడూ రాజకీయాలకు కొంచెం చోటిస్తారు. ‘దూకుడు’లో కాసేపు ఎమ్మెల్యే డ్రస్సులో కనిపించి అభిమానుల్ని ఖుషీ చేశారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారనే వార్త అభిమానుల్ని మరింత ఖుషీ చేస్తోంది. అయితే... ఇందులో రాజకీయాల కంటే ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుందట. ఇది రాజకీయ పార్టీలు, నాయకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న సినిమా కాదట. ‘భరత్ అనే నేను’ టైటిల్‌లోనే పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. ఆ ఫ్లేవ ర్‌తో పాటు కొరటాల శివ మార్క్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్ ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరకర్త.