
రామ్‌చరణ్
నాలుగు రోజులుగా వీర లెవల్లో విలన్స్‌ను వాయించారు రామ్‌చరణ్. ఈ ఉతుకుడు ఎలా ఉందనేది వెండితెరపై చూడాల్సిందే. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ఓ భారీ ఫైట్ చిత్రీకరించారు.
మొత్తం నాలుగు రోజుల పాటు జరిగిన ఈ హై యాక్షన్ సీక్వెన్స్‌కి కణల్ కన్నన్ ఫైట్ మాస్టర్‌గా చేశారు. గురువారంతో ఈ ఫైట్ సీన్ పూర్తయింది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. మరి... ఈ ఫైట్ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను హుషారెత్తిస్తుందో తెలుసుకోవడానికి బొమ్మ థియేటర్స్‌లో పడేంతవరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment