
సాక్షి, మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆన్‌లైన్ పద్ధతిలో సినిమా టికెట్ల విక్రయాలపై టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయ్యింది. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన సమావేశానికి నిర్మాత దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment