ఆల్‌మోస్ట్ అమెరికాలో... | DVV danayya new movie started | Sakshi
Sakshi News home page

ఆల్‌మోస్ట్ అమెరికాలో...

Published Wed, Nov 23 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

ఆల్‌మోస్ట్ అమెరికాలో...

ఆల్‌మోస్ట్ అమెరికాలో...

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్యతారలుగా శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు కొరటాల శివ కెమేరా స్విచాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘అమెరికాలో 80 శాతం, మిగతా చిత్రాన్ని హైదరాబాద్, విశాఖలో చిత్రీకరిస్తాం. డిసెంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు.

‘‘సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే కథకు బలం’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘నాకు ఇష్టమైన వ్యక్తులు, చిత్ర బృందంతో కలసి పని చేయడం హ్యాపీగా ఉంది’’ అని నాని తెలిపారు. దర్శకులు రవిరాజా పినిశెట్టి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, దామోదర ప్రసాద్, ‘దిల్’ రాజు, శిరీష్,  రవిశంకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement