
రామ్‌చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్
పాత్రల గురించి ఏవేవో ఊహలు. ఎన్నో పుకార్లు. హీరోయిన్‌గా వారు, వీరు అంటూ తెరపైకి అగ్ర తారల పేర్లు. కానీ ఇప్పటివరకైతే అధికారికంగా దర్శకుడు, హీరోలు, నిర్మాత తప్ప ఇంకెవ్వరూ ఖరారు కాలేదు. అవును.. ఇదంతా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్) గురించే. ఇప్పుడీ చిత్రం తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా ప్రారంభోత్సవం నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో జరుగుతుందట. రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని టాక్.
ఇదివరకే రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా కోసం లొకేషన్ హంట్ స్టార్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఓ నెల బ్రేక్ తీసుకుంటారట ఎన్టీఆర్. ఇక రామ్‌చరణ్ కూడా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఎలాగూ ఈ సినిమా చిత్రీకరణ కూడా నవంబర్‌కి పూర్తవుతుంది. సో... ఎన్టీఆర్, రామ్‌చరణ్ నవంబర్ కల్లా ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత ఏవో శిక్షణా తరగతులకు హాజరవుతారట. ఈ సినిమా 2020లో విడుదలవుతుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment