పరిగణిస్తున్నారట | parineeti chopra in rajamouli next movie rrr | Sakshi
Sakshi News home page

పరిగణిస్తున్నారట

Published Mon, Jan 28 2019 5:00 AM | Last Updated on Sun, Jul 14 2019 4:08 PM

parineeti chopra in rajamouli next movie rrr - Sakshi

పరిణీతీ చోప్రా

హీరోయిన్‌ను ఫిక్స్‌ చేయకుండానే రాజమౌళి తాజా మల్టీస్టారర్‌ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ కూడా స్టార్ట్‌ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ను కన్‌ఫార్మ్‌ చేశారన్నది తాజా సమాచారం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ హీరోల సరసన యాక్ట్‌ చేస్తున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. ఇప్పుడీ సినిమాలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ పరిణీతీ చోప్రాను పరిగణిస్తున్నట్టు సమాచారం. పరిణీతితో కథా చర్చలన్నీ పూర్తయ్యాయని, పారితోషికం విషయంలోనే డిస్కషన్స్‌ నడుస్తున్నట్లు టాక్‌. ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్‌ను కేటాయించనున్నారట పరిణితి. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్, ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు సముద్రఖని నటించనున్నారు. ఈ ఏడాది చివరలోపు షూటింగ్‌ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement