
ఈ నెల 26న మహేశ్‌బాబు ప్రమాణం చేయబోతున్నారు. ఏమని ప్రమాణం చేస్తారు? అంటే.. వెయిట్ అండ్ సీ. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ అనుకుంటున్నారట. ఇందులో సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేస్తారుగా.
బహుశా.. మహేశ్ 26న చేయబోయేది అలాంటిదే అయ్యుండొచ్చు. సో.. 26న సినిమాలోని డైలాగ్స్ వినిపిస్తారేమో? లేక ప్రమాణం చేస్తున్నట్లుగా ఉన్న లుక్‌ని విడుదల చేస్తారేమో? ‘‘రిపబ్లిక్ డే సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫస్ట్ ఓత్ (ప్రమాణం) చేయనున్నారు’’ అని సంక్రాంతి సందర్భంగా సినిమా అప్‌డేట్‌ను తెలియజేసింది చిత్రబృందం. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌ను రేపటి నుంచి స్టార్ట్ చేసి నెలాఖరు వరకు షూట్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment