రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనున్న సినిమా శుక్రవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ దానయ్య నిర్మాత. చరణ్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు చరణ్ హీరోగా ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ చిత్రాలను నిర్మించారాయన.