RRR Announcement: Rajamouli | Ramarao | Ram Charan Multistarrer Movie - Sakshi

Mar 22 2018 5:56 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli Multi Starrer Official Announcement - Sakshi

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో రాజమౌళి మల్టీ స్టారర్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌

బాహుబలి సినిమా తరువాత లాంగ్‌గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. కొద్ది రోజులు రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు.

అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్‌ ను రిలీజ్ చేశారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే లోగో తో రిలీజ్‌ అయిన ఈ టీజర్‌ లోని మూడు ఆర్‌లు రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావు (ఎన్టీఆర్‌)ల పేర్లు ప్రతిబింభించేలా డిజైన్‌ చేశారు. ఆర్ ఆర్‌ ఆర్‌ అనేది టైటిల్‌ కాదు కేవలం ఈ మెగా కలయికకు ప్రతీకగా ఈ లోగోను రిలీజ్ చేసినట్టుగా చిత్రయూనిట్‌ ప్రకటించారు. ఏదీ ఏమైన భారీ మల్టీ స్టారర్‌ సినిమాపై అధికారిక ప్రకటన రావటంతో మెగా, ఎన్టీఆర్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement