
బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్
రామ్‌చరణ్ యాక్షన్ సీన్లు బ్యాంకాక్‌లో బ్యాంగ్ బ్యాంగ్ చేస్తున్నాయి. పది రోజులుగా రామ్‌చరణ్ షూటింగ్ అక్కడే జరుగుతోంది. మరో ఐదు రోజులు అక్కడే సందడి చేస్తారు. ఈ సందడంతా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కోసమే. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్, నదియా, కృతీ కర్బందా తదితరులపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా డీవీవీ దానయ్య మాట్లాడుతూ - ‘‘ఫైట్‌తో పాటు టాకీ కూడా చిత్రీకరిస్తున్నాం. ఈ 13 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. విజయ దశమికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ ఇది అని, భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్-గోపీ మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం: తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై. ప్రవీణ్‌కుమార్.