యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రణం రుధిరం రౌద్రం). ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే మరో 30 శాతం షూటింగ్ మిగిలి ఉండటం, గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి విడుదలవడం కష్టంగా మారింది. దీంతో 2021 సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌ఆర్ఆర్` ఇప్పుడు వేసవికి వెళ్లిపోయినట్టు సమాచారం.
‘సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. అధికారికంగా ప్రకటించాము. అయితే లాక్ డౌన్ కారణంగా మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. దీంతో సినిమా విడుదల తేదీలో మార్పులు జరగే అవకాశం ఉంది' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీవీవీ దానయ్య పేర్కొన్నారు. అయితే ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్యన రాజమౌళి కూడా తెలిపారు. షూటింగ్ మళ్లీ ప్రారంభం అయితే గానీ.. ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయలేమంటూ జక్కన్న పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు.
చదవండి:
దసరాకు ‘అఖిల్’.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్
యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్
Comments
Please login to add a commentAdd a comment