హోమ్‌ఫుడ్‌ ఇస్తే ఫ్రెండ్‌ అయిపోతా | Kiara Advani interview about Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

హోమ్‌ఫుడ్‌ ఇస్తే ఫ్రెండ్‌ అయిపోతా

Published Sat, Jan 5 2019 2:41 AM | Last Updated on Sat, Jan 5 2019 2:41 AM

Kiara Advani interview about Vinaya Vidheya Rama - Sakshi

కియారా అద్వానీ

‘‘నాకు నార్త్‌ అండ్‌ సౌత్‌ అనే తేడా లేదు. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేస్తూ గ్లోబల్‌ ఆడియన్స్‌కు రీచ్‌ అవ్వాలన్నదే నా లక్ష్యం. వీలైనంతమంది ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశంతోనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌వైపు కూడా ముందుకు అడుగులు వేస్తున్నాను. ‘బాహుబలి’ చిత్రం భాషాభేదాలను చెరిపేసింది. ప్రస్తుతం ద్విభాషా, త్రిభాషా చిత్రాలు కూడా రూపొందుతున్నాయి’’ అని కియారా అద్వానీ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందిన సినిమా ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కియారా అద్వానీ చెప్పిన సంగతులు.

► ‘భరత్‌ అనే నేను’ సినిమాలో నేను చేసిన వసుమతి క్యారెక్టర్‌కి ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నా సీత క్యారెక్టర్‌కి డిఫరెన్స్‌ ఉంది. మంచి మాస్‌ కమర్షియల్‌ సినిమా ఇది. ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉంటుంది సీత. అదే ఎవ్వరూ లేకుండా రాముడు మాత్రమే ఉన్నప్పుడు డామినేట్‌ చేయాలని చూస్తుంది. అప్పుడు సీతనే బాస్‌ అన్నమాట (నవ్వుతూ). సినిమాలో రామ్‌చరణ్‌కి, నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. బోయపాటిగారు బాగా తీశారు. దానయ్యగారు కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు.

► బోయపాటిగారు ఫస్ట్‌ టైమ్‌ ఈ కథ చెప్పినప్పుడు మంచి ఫ్యామిలీ సినిమా చేయబోతున్నాననే ఫీలింగ్‌ కలిగింది. ప్రశాంత్‌గారు, స్నేహగారు, వివేక్‌ ఒబెరాయ్‌గారు.. ఇలా సిల్వర్‌స్క్రీన్‌పై 15 మంది మంచి నటీనటులు కనిపిస్తారీ సినిమాలో. వీరందరితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ప్రతి సినిమాకు ప్రిపేర్‌ అయినట్లే ఈ సినిమాకు డైలాగ్స్‌ ప్రిపేర్‌ అయ్యాను. ఒత్తిడికి గురి కాలేదు.

► తెలుగు సినిమా అయినా, హిందీ సినిమా అయినా డైరెక్టర్‌ విజన్‌ను నేను పూర్తిగా నమ్ముతాను. సినిమాలో నా స్క్రీన్‌ టైమ్‌ ఎంతసేపు ఉందన్నది కాదు. నా బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చానా? లేదా? అని మాత్రమే ఆలోచించుకుంటాను. స్క్రీన్‌పై కనిపించే టైమ్‌లో నా పాత్రతో ఆడియన్స్‌ను ఎంత ఎంగేజ్‌ చేశానన్న అంశాన్నే ముఖ్యంగా భావిస్తాను. క్వాలిటీ బాగా రావాలని కోరుకుంటాను.

► చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. భరతనాట్యం, కథక్‌లలో ప్రవేశం ఉంది. ఈ సినిమాలో బాగా డ్యాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. ఇక రామ్‌చరణ్‌గారు ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తారో మీ అందరికీ తెలుసు. సాంగ్స్‌ షూట్‌ టైమ్‌లో టీమ్‌ నుంచి నాకు మంచి కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ‘రామా లవ్స్‌ సీత, తస్సాదియా...’ సాంగ్స్‌ నా ఫేవరెట్‌.

► యాక్టర్స్‌ అందరికీ మంచి టైమ్‌ వస్తుంది. ‘ఎమ్‌ఎస్‌. ధోని: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ’ సినిమాలో సాక్షి మహేంద్రసింగ్‌ పాత్ర చేశాను. ఆ టైమ్‌లో ధోని సినిమా సాక్షి కదా అన్నారు కొందరు. హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ‘భరత్‌ అనే నేను’ సినిమాలో అవకాశం వచ్చింది. మహేశ్‌బాబు కో–స్టార్‌ అంటే తెలుగులో ఒక హీరోయిన్‌కి ఇంతకన్నా డ్రీమ్‌ లాంచ్‌ ఏం ఉంటుంది? అనిపించింది. నాకు టర్నింగ్‌ పాయింట్‌ అనిపించింది.

► బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌కి పెద్ద అభిమానిని నేను. ఓ రోజు ఆయన డైరెక్ట్‌గా కాల్‌ చేశారు. ఏదో పార్టీ అనుకున్నాను. కానీ ఆయన ‘లస్ట్‌ స్టోరీస్‌’లో నేను చేయనున్న పాత్రకు తాను డైరెక్ట్‌ చేయనున్నట్లు చెప్పారు. అది చిన్న మినీ ఫిల్మ్‌లా అనిపించింది. సెన్సిబిలిటీగా, నెర్వస్‌గా అనిపించింది. ఆడిషన్‌ కూడా చేయలేదు. డైరెక్ట్‌గా సెట్‌లోకి వెళ్లిపోయాం. ఈ వెబ్‌ సీరీస్‌తో నాకు ఫీమేల్‌ ఆడియన్స్‌లో గుర్తింపు పెరిగింది.

► విజయ్‌ దేవరకొండకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మంచి టాలెంటెడ్‌ యాక్టర్‌. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నాను. ఆడియన్స్‌ పోలిక పెడతారని తెలుసు. కబీర్‌ (షాహిద్‌ కపూర్‌), ప్రీతి క్యారెక్టర్స్‌ను ఆడియన్స్‌ ఇష్టపడతారని అనుకుంటున్నాను. మేం కష్టపడుతున్నాం. సందీప్‌ వంగాగారు ప్యాషనేట్‌ డైరెక్టర్‌. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్‌ పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లు అక్కడక్కడ మార్పులు చేశాం.

► మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌ ఫ్యామిలీ ఓరియంటెండ్‌ పీపుల్‌. అందుకే వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మంచి రిలేషన్‌ ఉంది నాకు. ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో నమ్రత, మహేశ్‌బాబు, సితారలతో స్నేహం ఏర్పడింది. ‘వినయ విధేయ రామ’ టైమ్‌లో చరణ్, ఉపాసనలతో రిలేషన్‌ కుదిరింది. హోమ్‌ఫుడ్‌ అంటే చాలా ఇష్టం.  ఎవరైనా హోమ్‌ఫుడ్‌ ఇస్తే ఇట్టే ఫ్రెండ్‌ అయిపోతా(నవ్వుతూ).

► బాలీవుడ్‌లో ‘కళంక్‌’ చేశా, ‘గుడ్‌న్యూస్, కబీర్‌సింగ్‌’ చేస్తున్నా. తెలుగులో  కొన్ని కథలు వింటున్నాను. నా పాత్ర ఆసక్తికరంగా ఉండే మంచి సినిమాల్లో నేను భాగమైతే అంతే చాలు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement