SS Rajamouli Meets AP CM YS Jagan Over RRR Movie Release, Details Inside - Sakshi
Sakshi News home page

SS Rajamouli: సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీపై జక్కన్న స్పందన

Published Mon, Mar 14 2022 8:28 PM | Last Updated on Tue, Mar 15 2022 8:17 AM

SS Rajamouli Met Ap Cm YS Jaganmohan Reddy - Sakshi

SS Rajamouli Met Ap Cm YS Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనను చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. తనతో చక్కగా మాట్లాడారని కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జక్కన్న పేర్కొన్నారు. సోమవారం దర్శక ధీరుడు రాజమౌళి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఈ నెల 25న ప్రపంవచవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌, తదితర అంశాలపై జక్కన్న సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి, అందుకు ఏం చేయాలో అది చేస్తామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని రాజమౌళి వెల్లడించారు.  కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయంపై తెలుగు సినీ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేసిన విషయం విధితమే. పలువురు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement