
ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి
ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోయే టైమ్ ఫిక్స్ అయింది. ఈ ఇద్దరితో రాజమౌళి భారీ మల్టీస్టారర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానుందట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. ఈ ఇద్దరి హీరోల కోసం ఓ అద్భుతమైన కథ రెడీ చేశారట.
దాన్ని హీరోలకు కూడా న్యారేట్ చేశారట. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాకముందే త్రివిక్రమ్‌తో చేస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాన్ని ఎన్టీఆర్, బోయపాటితో చేస్తున్న చిత్రాన్ని రామ్‌చరణ్ కంప్లీట్ చేసేస్తారట. ఆ తర్వాత ఇద్దరి ఫుల్ కాన్‌సంట్రేషన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ పైనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమా షూటింగ్, రిలీజ్‌కు రెండేళ్లు పట్టనుందని సమాచారం. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment