
ఎన్టీఆర్
ఇప్పటినుంచి 6 నెలల పాటు స్టీవ్స్ లాయిడ్ చెప్పిందే తింటారు, వింటారట ఎన్టీఆర్. ఇదంతా ఆయన నెక్ట్స్ సినిమాలో చేయబోయే పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌లో భాగమే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. ఈ కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 5–6 నెలల పాటు కఠినమైన బాడీ ట్రైనింగ్ తీసుకోనున్నారట.
ఈ శిక్షణంతా స్లిమ్‌గా కనిపించడం కోసం కాదండోయ్ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించడం కోసమట. ‘దంగల్’ సినిమాలో ఆమిర్‌ఖాన్ యంగ్ లుక్‌లో కనిపించినట్టుగా ఎన్టీఆర్ కండలు తిరిగిన గెటప్‌లో కనిపిస్తారట. ఈ శిక్షణ కాలం మొత్తం స్టీవ్స్ లాయిడ్ చెప్పిన డైట్ ప్రకారమే ఎన్టీఆర్ ఆహారం తీసుకుంటారు. ఈ కొత్త లుక్ అభిమానులను కచ్చితంగా ఆశ్చర్యపడేలా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో ముహూర్తం జరుపుకోనుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తారట. 2020లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment