నాచ్యులర్ స్టార్ నానీ చేయబోయే 28వ సినిమా అబ్‌డేట్ వచ్చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అంటే సుందరానికి...’ అనే క్రేజీ టైటిల్‌ను ప్రకటించారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇప్పటి వరకు నజ్రీయా తెలుగులో నటించకపోయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటుండటంతో ఆమె ఫ్యాన్‌కు పండగే. ఈ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తుండటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.(‘తెలుగులో తొలిసారిగా.. టైటిల్ తేదీని వైరల్ చేయండి’)
ఇక నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించనుండగా, డైరెక్టర్ వివేక్ రచయితగానూ మారారు. ఇప్పటికే ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’వంటి హిట్ సినిమాలతో అతి తక్కువ కాలంలోనే వివేక్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నవీన్ ఎర్‌నేని, రవి శంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. (శ్యామ్ సింగరాయ్‌లో విలన్‌గా నారా రోహిత్)
Comments
Please login to add a commentAdd a comment