
కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్ (కేపీవీఎస్‌ఎస్‌పీఆర్ సుందర ప్రసాద్).. ఏంటీ.. పేరు ఇంత పొడుగు ఉందని ఆలోచిస్తున్నారా? విషయం తెలియాలంటే మాత్రం సమ్మర్ వరకు వేచి ఉండక తప్పదు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అంటే.. సుందరానికీ!’.
ఇందులో నాని పాత్ర పేరు కేపీవీఎస్‌ఎస్‌పీఆర్ సుందర ప్రసాద్. ఈ చిత్రంలో నజ్రియా ఫాహద్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నాని ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేసి, సినిమాను ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment