first week collections
-
గుంటూరు కారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?
-
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్‌గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
'అంటే.. సుందరానికీ' వచ్చిన కలెక్షన్లు ఎంతంటే ?
Nani Ante Sundaraniki First Week Box Office Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా, తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ. 18.39 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ. 32.60 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్లో మంచి హిట్ మూవీగా సినిమా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. నైజాం- రూ. 5.58 కోట్లు సీడెడ్- రూ. 1.13 కోట్లు ఉత్తరాంధ్ర- రూ. 1.33 కోట్లు ఈస్ట్- రూ. 0.93 కోట్లు వెస్ట్- రూ. 0.79 కోట్లు గుంటూరు- రూ. 0.87 కోట్లు కృష్ణా- రూ. 0.84 కోట్లు నెల్లూరు- రూ. 0.58 కోట్లు మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి- 12.05 కోట్లు (రూ. 20.40 కోట్లు గ్రాస్) కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా- 1.34 కోట్లు ఓవర్సీస్- 5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా- రూ. 18.39 కోట్లు (రూ. 32.60 కోట్లు గ్రాస్) చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
ఎన్టీఆర్ 'టెంపర్' భారీ కలెక్షన్లు
-
ఎన్టీఆర్ 'టెంపర్' భారీ కలెక్షన్లు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. తొలి వారం భారీ వసూళ్లు రాబట్టింది. టెంపర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన టెంపర్ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఇటీవలకాలంలో ఎన్టీఆర్ చిత్రాల్లో టెంపర్ అత్యధిక వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.