Prashanth Neel Plans To Pan India Movie With Nani, News Goes Viral - Sakshi
Sakshi News home page

Pan India Movie: నానితో ప్రశాంత్‌ నీల్‌ పాన్‌ ఇండియా మూవీ!

May 24 2022 1:56 PM | Updated on May 24 2022 3:53 PM

Prashanth Neel Plans To Pan India Movie With Nani, News Goes Viral - Sakshi

కేజీయఫ్‌-2 హిట్‌తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పేరు మళ్లీ దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయనతో సినిమా చేయడానికి స్టార్‌ హీరోలు క్యూ కడుతున్నారు. కానీ ప్రశాంత్‌ మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తూ.. పాన్‌ ఇండియా చిత్రాలనే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ రూమర్ సౌత్ మొత్తం చెక్కర్లు కొడుతోంది. 

సలార్‌, ఎన్టీఆర్‌ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ మరో టాలీవుడ్‌ హీరోతోనే పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. నేచురల్‌ స్టార్‌ నాని. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే నానిపై ఈ మధ్య కాలంలో చాలా రూమర్స్‌ వస్తున్నాయి. మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నాని కూడా నటిస్తున్నాడని టాక్‌. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న మూవీలోనూ నాని విలన్‌గా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. వీటిల్లో ఏది నిజమో, ఏది గాసిప్ అనేది నానీనే చెప్పాలి. ప్రస్తుతం నాని ‘అంటే సుందరానికి..’ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement