Police Case File On Mythri Movie Makers And Shreyas Media, Deets Inside - Sakshi
Sakshi News home page

‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై కేసు నమోదు

Published Sat, Jun 11 2022 11:00 AM | Last Updated on Sat, Jun 11 2022 12:35 PM

Case File On Mythri Movie Makers And Shreyas Media - Sakshi

అనుమతి తీసుకోకుండానే ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌, శ్రేయాస్‌ మీడియాపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని గురువారం మాదాపూర్‌ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా వెళ్లారు.

(చదవండి: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ)

అయితే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ లాంటి స్టార్‌ హీరో వస్తున్నప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్‌ మీడియా ఈ ఈవెంట్‌ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రేయాస్‌ మీడియా ఈవెంట్‌ మేనేజర్‌ సురేశ్‌తో పాటు మైత్రీ మూవీస్‌పై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement