
నవ దంపతులు బెర్లిస్, కార్తికేయన్
అన్నానగర్: ఇండోనేషియా దేశానికి చెందిన మహిళను తమిళ సంప్రదాయం ప్రకారం తమిళనాడులోని కారైకుడి యువకుడు బుధవారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. కారైకుడి సమీపంలోని పల్లత్తూర్ ప్రాంతానికి చెందిన మునియాండి రైతు కుమారుడు కార్తికేయన్ (32). ఇతను డిప్లొమో చదివి సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే ఇండోనేషియాకి చెందిన బెర్లిస్ (30), కార్తికేయన్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరి కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో బెర్లిస్, తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని కోరింది. బుధవారం కారైకుడిలోని పల్లత్తూరులో పెద్దల సమక్షంలో బెర్లిస్, కార్తికేయన్ వివాహం తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment