78వ ఏట 17ఏళ్ల పడుచుతో పెళ్లి.. వెంటనే | Indonesia 78 Year Old Man Married to Young Girl Divorce After 22 Days | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 6 2020 12:31 PM | Last Updated on Fri, Nov 6 2020 12:44 PM

Indonesia 78 Year Old Man Married to Young Girl Divorce After 22 Days - Sakshi

జకర్తా: గత నెల ఇండోనేషయాలోనే కాక సోషల్‌ మీడియాలో కూడా ఓ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలయ్యాయి. ఎందుకంటే 78 ఏళ్ల వృద్ధుడు వయసులో తనకంటే 61 ఏళ్లు చిన్నదైన యువతిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించాడు. జనాలు ఈ పెళ్లి షాక్‌ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో బాంబ్‌ పేలింది. పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా కాకముందే విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు ఈ దంపతులు. ఆ వివరాలు.. గత నెలలో అబా సర్నా (78), నోని నవిత (17) అనే యువతిని ఎంతో వైభవంగా బంధుమిత్రులందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లై కనీసం నెల రోజులు కూడా కాలేదు. సరిగ్గా చెప్పాలంటే వివాహం అయిన 22 రోజులకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఇదంతా కలలా తోస్తుంది. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. విడాకులు తీసుకోబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యాం’ అన్నారు. అంతేకాక ‘అబా సర్నాతో మాకు ఎలాంటి సమస్య లేదు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ వివాహం నచ్చలేదు. అ‍క్కడి నుంచే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చు’ అన్నారు. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మ‌నువాడారు!)

కానీ అబా సర్నా కుటుంబ సభ్యులు మాత్ర నోని పెళ్లికి ముందే గర్భవతి అని.. ఆ విషయం దాచి పెట్టి వివాహం చేశారని అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితో నోని కుటుంబ సభ్యులు ఈ ఆరోపణల్ని ఖండించారు. ఇక వివాహ సమయంలో అబా సర్నా, నోనికి మోటార్‌ సైకిల్‌తోపాటు 50 వేల రూపాయల నగదుతో పాటు ఆమెకు అవసరమైన వాటిని కట్నంగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇక్కడ వరుడు, వధువుకు కట్నం ఇవ్వడం సాధారణం. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోనేషియాలో గత ఏడాది చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు గర్ల్‌ ఫ్రెండ్స్‌ని బాధపెట్టడం ఇష్టం లేక ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement