
చేతులు దాటాయి గనకే..!
‘‘అవును.. మా పెళ్లి ఆగిపోయింది. ఇది ఊహించని పరిణామమే. కానీ, పరిస్థితులు మన చేతులు దాటినప్పుడు, ఏం జరిగితే దాన్ని అంగీకరించాలి’’ అని త్రిష అంటున్నారు. తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ మణియన్‌తో త్రిష పెళ్లి నిశ్చితార్థమై, ఆఖరుకు ఆగిపోయిన విషయం తెలిసిందే.
నిశ్చితార్థం జరిగిన మూడు నెలలకు బ్రేకప్ ప్రకటించిన త్రిష, ‘‘నేను ఆ భగవంతుడి బిడ్డని. ఆయన ఏది నిర్ణయిస్తే అది అంగీకరిస్తా. ఏది జరిగినా అది ఆ దేవుడి ఇష్టప్రకారమే జరుగుతుందని నమ్ముతా’’ అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.