అనుష్కపై కోలీవుడ్ గుర్రు | celebraties life is a like a open the book | Sakshi
Sakshi News home page

అనుష్కపై కోలీవుడ్ గుర్రు

Published Sat, Jul 19 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

అనుష్కపై కోలీవుడ్ గుర్రు

అనుష్కపై కోలీవుడ్ గుర్రు

సెలబ్రిటీల జీవితం తెరచిన పుస్తకం లాంటిది. ప్రతి సాధారణ వ్యక్తీ చదవడానికి ఆసక్తి చూపిస్తాడు. అందుకే సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగెయ్యాలి. ముఖ్యంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే చిక్కులు తప్పవు. ఇక తారల విషయానికొస్తే మొన్న నచ్చిన హీరో అజిత్ అంటూ నటి త్రిషే నోరుపారేసుకుని నటుడు విజయ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి పొరపాటే నటి అనుష్క చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందాల భామ అనుష్క ఇటీవల ఓ భేటీలో తన అభిమాన నటులెవరన్న ప్రశ్నకు అభిషేక్ బచ్చన్, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ అంటూ బాలీవుడ్ నటులను చెప్పడం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో కలకలం రేకెత్తించింది.

నిజానికి ఈ బ్యూటీ తమిళంలో విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి టాప్ హీరోలతో, తెలుగులో నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాష్ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటి వీరిలో ఎవరినీ తన అభిమాన హీరోగా చెప్పకుండా బాలీవుడ్ హీరోల పేర్లను చెప్పడం దక్షిణాది అభిమానుల కోపోగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వారంతా అనుష్కాకు వ్యతిరేకం. ఫేస్‌బుక్‌ల్లోను, ట్విట్టర్లలోనూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అభిమానుల ఆగ్రహానికి గురైన ఏ హీరోయిన్ మనలేదన్నది అనుష్క, త్రిష లాంటి వారు గ్రహించాలంటున్నారు సినీ పండితులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement