Telugu Chitra industry
-
కొత్తగా...!
‘‘తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఇటీవల చెన్నైలో కురిసిన వర్షాల తర్వాత అందరిచూపు హైదరాబాద్‌పై పడింది. దక్షిణాదిన హైదరాబాద్ సినిమా హబ్‌గా మారడానికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుంది ’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అన్నారు. శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ మూవీస్ పతాకంపై సమర్, అక్షిత, కిమయా జంటగా సతీష్ గుండేటి దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తోటా గోపాల్ నిర్మించిన చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’. ఈ సినిమా టీజర్‌ను మంత్రి హరీష్‌రావు, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ప్రేమికుల కథాంశంతో తెరకెక్కిందీ చిత్రం. ఫిబ్రవరి మొదటి వారంలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం కొత్త కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా మాట్లాడారు. -
శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్
సాక్షి, తిరుమల : సినీ నటుడు శ్రీకాంత్, ఊహ తమ కుమార్తె, కుమారులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. శ్రీవారు, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచిందని తెలిపారు. తాను నటించిన ఢీ అంటే ఢీ జనవరిలో విడుదల కానుందని చెప్పారు. నాటు కోడి, జల్సారాయుడు సెట్లో ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
అంతులేని చరిత్ర
సినీ ప్రపంచంలో ‘మరో చరిత్ర’ సృష్టించి... ‘అంతులేని కథ’లతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దర్శకుడు కె.బాలచందర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ చిన్నబోయింది. భాగ్యనగరంతో విశిష్ట అనుబంధం కలిగిన బాలచందర్‌ది ‘మరపురాని చరిత్ర’ అంటూ ప్రేక్షక లోకం నిరాజనాలు పలుకుతోంది. 2011 జనవరి 11న ప్రతిష్టాత్మక ఏఎన్నార్ అవార్డును అందుకోవడానికి ఇక్కడికి వచ్చిన ఆయనతో పంచుకున్న జ్ఞాపకాలను సినీ జనం నెమరువేసుకుంటున్నారు. అక్కినేని అవార్డు అందుకున్న బాలచందర్ సిటీబ్యూరో: ఉత్తర, దక్షిణాది భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన సినీ లెజెండ్ కె.బాలచందర్‌కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతకుముందు ఎన్నోసార్లు ఆయన నగరాన్ని సందర్శించినప్పటికీ 2011 జనవరి 11వ తేదీకి ప్రత్యేకత ఉంది. ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకొనేందుకు ఆయన ఆ రోజునగరానికి వచ్చారు. శిల్పకళావేదికలో కన్నుల పండువగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సందర్భంగా బాలచందర్‌ను సాదరంగా ఆహ్వానించి అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఆ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు, టి.సుబ్బరామిరెడ్డి, వీరప్పమొయిలీ, సినీ నటుడు అక్కినేని నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తన కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకోవడం మరచిపోలేని విషయమని సంతోషం వ్యక్తం చేశారు. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన అన్నపూర్ణ స్టూడియోను సందర్శించి, ఎంతో బాగుందని ప్రశంసించారు. బాలచందర్ మరణ వార్తతో నగరంలోని సినీ ప్రియులు, ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. -
అనుష్కపై కోలీవుడ్ గుర్రు
సెలబ్రిటీల జీవితం తెరచిన పుస్తకం లాంటిది. ప్రతి సాధారణ వ్యక్తీ చదవడానికి ఆసక్తి చూపిస్తాడు. అందుకే సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగెయ్యాలి. ముఖ్యంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే చిక్కులు తప్పవు. ఇక తారల విషయానికొస్తే మొన్న నచ్చిన హీరో అజిత్ అంటూ నటి త్రిషే నోరుపారేసుకుని నటుడు విజయ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి పొరపాటే నటి అనుష్క చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందాల భామ అనుష్క ఇటీవల ఓ భేటీలో తన అభిమాన నటులెవరన్న ప్రశ్నకు అభిషేక్ బచ్చన్, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ అంటూ బాలీవుడ్ నటులను చెప్పడం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో కలకలం రేకెత్తించింది. నిజానికి ఈ బ్యూటీ తమిళంలో విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి టాప్ హీరోలతో, తెలుగులో నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాష్ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటి వీరిలో ఎవరినీ తన అభిమాన హీరోగా చెప్పకుండా బాలీవుడ్ హీరోల పేర్లను చెప్పడం దక్షిణాది అభిమానుల కోపోగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వారంతా అనుష్కాకు వ్యతిరేకం. ఫేస్బుక్ల్లోను, ట్విట్టర్లలోనూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అభిమానుల ఆగ్రహానికి గురైన ఏ హీరోయిన్ మనలేదన్నది అనుష్క, త్రిష లాంటి వారు గ్రహించాలంటున్నారు సినీ పండితులు.