కొత్తగా...! | new telugu movie kotta kottaga unnadi | Sakshi
Sakshi News home page

కొత్తగా...!

Published Mon, Jan 18 2016 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

కొత్తగా...!

కొత్తగా...!

 ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఇటీవల చెన్నైలో కురిసిన వర్షాల తర్వాత అందరిచూపు హైదరాబాద్‌పై పడింది. దక్షిణాదిన హైదరాబాద్ సినిమా హబ్‌గా మారడానికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుంది ’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అన్నారు. శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ మూవీస్ పతాకంపై సమర్, అక్షిత, కిమయా జంటగా సతీష్ గుండేటి దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తోటా గోపాల్ నిర్మించిన చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’.

 ఈ సినిమా టీజర్‌ను మంత్రి హరీష్‌రావు, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ప్రేమికుల కథాంశంతో తెరకెక్కిందీ చిత్రం. ఫిబ్రవరి మొదటి వారంలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం కొత్త కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement